NTV Telugu Site icon

One Nation-One Election: “ఒకే దేశం ఒకే ఎన్నిక”పై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదల..

One Nation One Election Bill 2

One Nation One Election Bill 2

ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.

READ MORE: Tragedy: ఇటుక బట్టీ గోడ కూలి నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు మృతి..

ఈ జేఏసీలో మొత్తం 39 మంది సభ్యులను చేర్చారు. లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం లభించింది. వాస్తవానికి జేపీసీలో 31 మందిని నియమించనున్నట్లు కేంద్రం తొలుత వెల్లడించింది. కానీ, కీలకమైన ఈ బిల్లులపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్న దృష్ట్యా 39 మందిని నియమించాలని నిర్ణయించింది. జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్‌ నుంచి ఐదుగురుకి అవకాశం కల్పించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ (2), తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(2), డీఎంకే(2), వైఎస్సార్‌సీపీ(1) శివసేన(1), టీడీపీ(1), జేడీ–యూ(1), ఆర్‌ఎల్డీ(1), ఎల్‌జేఎస్పీ–ఆర్‌వీ(1), జేఎస్పీ(1), శివసేన–ఉద్ధవ్‌(1), ఎన్సీపీ–శరద్‌ పవార్‌(1), సీపీఎం(1), ఆమ్‌ ఆద్మీ పార్టీ(1)కి సైతం స్థానం కల్పించారు. అధికార ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీని నామినేట్‌ అయ్యారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో చివరి వారానికి సంబంధించిన మొదటి రోజు నాటికి లోక్‌సభకు సమరి్పంచాల్సి ఉంటుంది.

READ MORE: Jammu and Kashmir: జీత భత్యాల కోసం ఎమ్మెల్యేల ఎదురు చూపులు..

Show comments