Site icon NTV Telugu

Mamata Banerjee: బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్య..

Mamata Banerjee

Mamata Banerjee

ఓ వైపు భారత సైన్యం బంగ్లాదేశీ చొరబాటు దారులను అడ్డుకునేందుకు కృషి చేస్తుంది. మరోపైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. శరనార్థులు బెంగాల్ తలపులు కొడితే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. శరణార్థులపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ..ఈ హామీ ఇచ్చారు.

READ MORE:Akhilesh Yadav: మోడీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, త్వరలో పడిపోతుంది..

బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ప్రకటన చేశారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశీయుల కోసం పశ్చిమ బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.

READ MORE: Ramappa Temple: ప్రమాద అంచుల్లో యునెస్కో గుర్తింపు ఉన్న రామప్ప దేవాలయం..

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన విషయాలను మనం ప్రేరేపించకూడదని మమతా బెనర్జీ అన్నారు. బంగ్లాదేశీయులు మా తలుపు తడితే వారికి ఆశ్రయం ఇస్తామన్నారు. శరణార్థులపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. “హింసాత్మక బంగ్లాదేశ్‌లో బెంగాల్ నివాసితువుల బంధువులకు నేను పూర్తి మద్దతునిస్తాను. మీరు బెంగాల్ తలుపు తడితే, నేను మీకు సహాయం చేస్తాను.” అని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్‌లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు.. చదువుకోవడానికి అక్కడికి వెళ్లిన వాళ్లకుచికిత్స కోసం వెళ్లి తిరిగి రాలేని వారికి సాయం అందిస్తానన్నారు.

READ MORE: VIRAAJI: ‘విరాజి’గా వచ్చేస్తున్న వరుణ్ సందేశ్.. ట్రైలర్‭ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల..

ఆమె మాట్లాడుతూ, “నేను బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేను. ఎందుకంటే అది వేరే దేశం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. కానీ నిస్సహాయ ప్రజలు బెంగాల్ తలుపు తడితే.. ఖచ్చితంగా వారికి ఆశ్రయం ఇస్తా. ఈ విషయానికి నేను కట్టుబడి ఉంటా.. ఎందుకంటే దీనిపై ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉంది. ఎవరైనా శరణార్థులు ఉంటే.. పరిసర ప్రాంతం వారికి ఆశ్రయం కల్పిస్తుంది.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version