Bhatti Vikramarka: ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యా శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణాలకు గాను బడ్జెట్లో నిధుల కేటాయింపు కూడా జరిగినందున భవన నిర్మాణాల పనులు త్వరితగతిన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు ఒక చోట ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు ఇంటిగ్రేటేడ్ గా ఒకే చోట నిర్మాణం చేయడం వల్ల స్థల సమస్యను అధిగమించొచ్చని సూచించారు. అదే విధంగా కామన్‌గా అందేటి సౌకర్యాల వల్ల కూడ కొంత అదనపు ప్రయోజనం కల్గుతుందన్నారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు ఒకే చోట ఉండటం వల్ల విద్యార్థుల్లో సోదర భావాన్ని పెంపొందించడం వల్ల కుల రహిత సమాజానికి బాటలు వేసిన వారమవుతామన్నారు. అలాగే మిని ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ది చేయడానికి బాగుంటుందని వివరించారు. ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం మధిర నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు.
Also Read
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
Sammakka Sarakka Jatara: మేడారంలో కీలక ఘట్టం ఆవిష్కృతం.. గద్దెపైకి సమ్మక్క
ఎస్సీ, బీసీ, మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఎర్రుపాలెం మండల పరిధిలో నిర్మాణం చేయడానికి స్థల ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం జరుగడానికి కావాల్సిన స్థల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం త్వరగా జరుగడానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్ధుల్ నదీంను ఆదేశించారు. అనంతరం బెంగళూర్‌కు చెందిన ఆర్కిటెక్ ప్రతినిధులు దేశంలో వివిధ ప్రాంతాల్లో వారు చేపట్టిన ఇంటర్ నేషనల్ మోడల్ పాఠశాలలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజేటేంషన్‌ను విద్యాశాఖ అధికారుల సమక్ష్యంలో డిప్యూటి సీఎం తిలకించారు. అన్ని హంగులతో అత్యుత్తమ ప్రమాణాలతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు ఒకే మోడల్ గా చేపట్టాడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గాల వారీగా నాలేడ్జ్ కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటి సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకటించునున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఆర్ధిక వెసలుబాటు కల్పించడానికి ఈకేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జ్యోతి భా పూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలేడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఈ లక్ష్యం సఫలికృతం కావాడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!