Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రనటులందరితో నటించి ఇండస్ట్రీలో తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల తన డాక్యుమెంటరీలో నాన్ రౌడీ ధాన్(తెలుగులో నేను రౌడీనే) వీడియో క్లిప్ ఆ సినిమా నిర్మాత ధనుష్ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆయన నయన్ మీద 10 కోట్ల జరిమానా వేశాడు. ఈ విషయం మీదే ధనుష్ ని టార్గెట్ చేస్తూ నయనతార సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ రాసింది. ఓపెన్ లెటర్ తో మ్యాటర్ మరింత సీరియస్ అయింది. ఐతే నయన్, ధనుష్ కేసు విచారణ రాగా నయనతారకు కోర్టు ఝలక్ ఇచ్చింది. ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ ధాన్ క్లిప్స్ ను అతని పర్మిషన్ తో వేసుకోవాలి నిర్మాత పర్మిషన్ లేనిది ఎలా వేసుకుంటారని ప్రశ్నించింది. అంతేకాదు ఈ ఇష్యూపై ఆమె నుంచి క్లారిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జనవరి 8 లోగా నయనతార సమాధానం చెప్పాలని కోర్టు సూచించింది. ఇంతకీ కోర్టుకు నయనతార క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ధనుష్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కాబట్టి అతను డిమాండ్ చేయడంలో తప్పులేదని కోర్టు అభిప్రాయపడింది. అలా కాకుండా అతని అనుమతి లేకుండా ఆ క్లిప్స్ వాడటం చట్టరీత్యా నేరమే అవుతుందని పేర్కొంది.
Read Also:Airtel One Year Plan: ఏడాదిపాటు చెల్లుబాటుతో అతి తక్కువ ధరకు ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్‌టెల్
ధనుష్ తో కలిసి ఇదివరకు స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంది. వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంది. ఐతే ఈ ఇష్యూపై కోలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సైలెంట్ గా ఉన్నారు. మరి నయన్ వర్సెస్ ధనుష్ వివాదంలో గెలుపు ఎవరిని వరిస్తుంది. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే మార్చం ఎవరు చేస్తరన్నది చూడాలి. సినిమాల విషయానికి వస్తే నయనతార తన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కొడై సినిమాలను చేస్తున్నాడు. ఇడ్లీ కొడై సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ ఇటీవల వచ్చి సక్సెస్ అందుకుంది. అందుకే మళ్లీ నటిస్తూ డైరెక్షన్ చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అందుకే ఇక్కడ కూడా ఆయనకు భారీ అభిమానులు ఏర్పడ్డారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో మన్మథుడు నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి అవార్డింగ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఐతే కమర్షియల్ గా కూడా కుబేర నెక్స్ట్ లెవల్లో ఉంటుందని సమాచారం.
Read Also:CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి