అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటకు పంపొద్దు.. వాళ్లు అన్ని వినాలని స్పీకర్ కు తెలియజేశారు. ఎంత గొడవ చేసినా బయటకు పంపొద్దు అధ్యక్ష అంటూ స్పీకర్ కు చెప్పారు. గవర్నర్ స్పీచ్ వింటుంటే సిగ్గు అనిపించింది అని కేటీఆర్ అన్నారు.. ఔను నువ్వు సిగ్గు పడాలని ముఖ్యమంత్రి విమర్శించారు. సిగ్గు పడే విషయాలు అన్ని చెప్తానన్నారు రేవంత్ రెడ్డి.
Read Also: CM Revanth: కేసీఆర్.. అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా
ఇసుక దోపిడీలో మీ వాటా లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెరేళ్లలో దళితులను పోలీసులతో కరెంట్ షాకులు పెట్టింది నువ్వు.. సంసార జీవితంకి కూడా పనికి రాకుండా చేశారని మండిపడ్డారు. మీరా కుమార్ చూద్దాం అని వస్తే పోలీసులతో అడ్డుకున్నది మీరు.. దానికి సిగ్గు పడని ఆరోపించారు. ఖమ్మంలో రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసిన చరిత్ర మీది.. అందుకు సిగ్గు పడు.. సిగ్గుతో తల దించుకో అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి.. సభను అడ్డుకున్నారు. స్పీకర్ వెల్ లోకి రావద్దు అని చెప్పగా.. ఇప్పటికే సభ ఐపోలేదు.. ఇంకా కొనసాగుతుందని తెలిపారు. అన్ని చర్చ చేస్తామన్నారు.
Read Also: Jabardasth Satya : పాత్ర నచ్చక పవన్ కల్యాణ్ గారి సినిమానే వదులుకున్నాను.