Site icon NTV Telugu

Haryana: పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ.. భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చి..

Haryana

Haryana

హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్‌ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్‌ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.

READ MORE: Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌ గెలిచిన తర్వాత హెచ్‌1బీ వీసా గురించి భారతీయుల సెర్చ్‌..!

పోలీసుల సమాచారం ప్రకారం… సోనిపట్‌లోని ఖర్ఖోడా గురుకుల వీధికి చెందిన ఓ యువకుడు హరిద్వార్‌కు చెందిన పల్లవిని నవంబర్ 13న వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో దాదాపు 1.25 లక్షల రూపాయలను కూడా వధువు తరఫు వారికి అందించారు. వివాహం తర్వాత, యువకుడు నవంబర్ 14న ఖర్ఖోడా చేరుకున్నాడు. నవంబర్ 24న ఇక్కడ వివాహ రిసెప్షన్ నిర్వహించగా, నవంబర్ 15వ తేదీ రాత్రి నవ వధువు టీలో మత్తు మందు కలిపి భర్తకు, అత్తకి ఇచ్చింది. టీ తాగి వధువు భర్త, అత్త స్పృహతప్పి పడిపోయారు. ఇంతలో బంగారు నగలు, రూ.2 లక్షల నగదుతో వధువు పరారైంది. దీని తర్వాత, యువకుడు, అతని తల్లి ఖర్ఖోడా ఆసుపత్రిలో చేరారు. ఇంటికి చేరుకునే సరికి పరిస్థితి సద్దుమణిగేసరికి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో చాలా వస్తువులు కూడా పోయాయి. నవ వధువు తండ్రికి ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఈ విషయంపై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరాడు.

Exit mobile version