ఇటీవలి కాలంలో పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. గొడవల కారణంగా విడాకులు తీసుకోవడం, అక్రమ సంబంధాలు, ప్రియుడు లేదా ప్రియురాలితో పారిపోవడం వల్ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇదీకాకుండా నాగరిక సమాజంలో వరకట్న వేధింపులు నవ వధువుల మృతికి కారణమవుతున్నాయి. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అగుడు పెట్టిన కొత్త కోడళ్లను అదనపు కట్నం కోసం వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మీరట్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కట్నం కావాలంటూ వివాహితను భర్త,…
విజయవాడలో కట్నం కోసం నవ వధువుకు వేధింపుల పర్వం బయటపడింది. రూ.5 కోట్లు ఇచ్చినా.. పెళ్లైన రెండు రోజులకే కట్నం వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని వధువు భవానీపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. చెరుకూరి లక్ష్మణరావు విజయవాడ…
హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్‌ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్‌ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Dowry Harassment: ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది. అయితే ఆ ఆశలన్నీ నిరాశనే మిగిల్చాయి. కొన్నినెలలు ఆనందంగా సాగిన వారిజీవితంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నంకోసం భర్త మానసికంగా.. శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పుట్టింటి వారికి చెబితే బాధపడతారని చెప్పలేక నరకయాతన పడింది. భర్తతో పాటు అత్తమామ తోడవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భరించలేక సహకోల్పోయిన వధువు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారికి పుట్టెడు దుఖం మిగిల్చింది. ఈఘటన మైలార్ దేవ్‌పల్లిలో జరిగింది. Read also:…
బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో మద్యం సీసాలను ఇంట్లో దాచిపెట్టినట్లు అనుమానం రావడంతో పోలీసులు ఓ నవ వధువు అత్తారింటి వద్ద హల్చల్ చేశారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపించకుండా పెళ్లి కూతురు బెడ్ రూమ్ కి వెళ్లి మద్యం సీసాలకోసం వెతికారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళితే.. హజీపూర్ నగరంలోని హత్సార్‌గంజ్ ప్రాంతంలో నివసించే షీలాదేవి కొడుకుకు ఇటీవలే పూజా కుమారితో…