హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్‌ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్‌ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.