ODI World Cup 2023: భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడమే అతిపెద్ద సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Shastri React on Indian Playing XI for ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో మెగా టోర్నీకి తెరలేవనుంది. ప్రపంచకప్ మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో గురువారం (అక్టోబర్ 5) మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లండ్, న్యూజీలాండ్ మధ్య ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని జట్లకు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడం అతిపెద్ద సవాల్ అని టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇందుకు టీమిండియా మినహాయింపేమీ కాదని తెలిపారు.
గురువారం నుంచి వన్డే ప్రపంచకప్ 2023 మొదలుకానున్నా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచులో భారత తుది జట్టులో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువని రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘జట్టు కోసం ప్రతి ఒక్కరూ ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. భారత జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ చేరడంతో.. తుది జట్టు ఎంపిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుల్దీప్ యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాణిస్తే.. తర్వాతి మ్యాచుల్లో స్థానం మాత్రం సుస్థిరం కాదు. అయితే అతడి బౌలింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు’ అని రవిశాస్త్రి అన్నారు.
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
Also Read: Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్!
‘కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలర్. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన అతడు ఇటీవల నాణ్యమైన బౌలింగ్ వేశాడు. వికెట్స్ కూడా పడగొట్టాడు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతోనే భారత్ బరిలోకి దిగాలి. అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంటుంది. హార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియాకు పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండనే ఉన్నాడు’ అని రవిశాస్త్రి చెప్పారు. అయితే ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసే బౌలర్ కుల్దీప్ అని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ జోస్యం చెప్పాడు. ఆసియా కప్ 2023లో కుల్దీప్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!