తరుణ్ భాస్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.తన తరువాత సినిమాని హీరో విశ్వక్సేన్ తో కలిసి ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించాడు..ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు అనుకున్న స్థాయిలో అంతగా ఆడలేదు.కానీ ఈ సినిమా ఓటీటీలోను అలాగే టెలివిజన్ ప్రసారమయి మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించింది..
ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని తెలుస్తుంది .ఇక ఈ సినిమా విడుదల అయిన దాదాపు ఐదు సంవత్సరాల అవుతున్న సందర్బంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినట్లు సమాచారం.ఈ సినిమాను ఈనెల 29వ తేదీనా మళ్ళీ థియేటర్స్ లో విడుదల అవుతుంది.ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన క్షణాలలోనే థియేటర్లన్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి.. దీంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున డైరెక్టర్ పై అలాగే నిర్మాత పై తీవ్రస్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారనీ సమాచారం.టికెట్స్ అన్నింటిని బ్లాక్ చేశారు అంటూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్లపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ. ఏంటి మ్యాడ్ నెస్ .?మజాక్ అయిపోయిందా? సినిమా టిక్కెట్లు అన్నీ సేల్ అయిపోయాయి. ఇలా సేల్ అవ్వడంతో కొంతమంది మీరే టికెట్స్ ను బ్లాక్ చేశారు కదా అని నన్ను అడుగుతున్నారని. ఇలా సినిమా మొదట విడుదల అయినప్పుడే చేసుంటే నేను మంచిగా గోవాలో ఇల్లు కొని డెవలప్ అయితుండే నిజంగా రాహుకాలంలా పుట్టుంట నేను’అంటూ ఎంతో ఫన్నీగా రియాక్ట్ అయ్యరు. తరుణ్ భాస్కర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
https://twitter.com/TharunBhasckerD/status/1673686518861529089?s=20