NTV Telugu Site icon

OG : “ఓజి” ఇండస్ట్రీ హిట్ ఖాయం.. ఇది కదా కాన్ఫిడెన్స్

New Project (56)

New Project (56)

OG : పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్‌ నటుడు శింబు ఓ పాట పాడనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది. శింబుతో కలిసి తమన్‌, సుజీత్‌ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also:PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల

గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ‘ఓజీ’ తెరకెక్కుతుంది. ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో క్రేజీ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. మరి చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న తన మార్క్ యాక్షన్ సినిమా ఇది కావడంతో అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉండగా పవన్ దీనిని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయనున్నారు.

Read Also:Israel-Iran: ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశాలు!.. యుద్ధం జరిగితే ఎవరికి మద్దతివ్వాలనే దానిపై నిర్ణయం

ఇక ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని సినిమా సంగీత దర్శకుడు థమన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఓజి అప్డేట్స్ అతి త్వరలోనే అందిస్తామని ఈ సినిమా కోసం సుజీత్ అదిరే ప్లానింగ్ లు చేస్తున్నాడు. కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అప్డేట్స్ తో కలుద్దాం అని థమన్ ట్వీట్ చేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ థమన్ కాన్ఫిడెన్స్ చూసి మంచి ఎగ్జైటెడ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Show comments