Thalapathy Vijay : ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిమానుల అత్యుత్సహం రోజురోజుకి హద్దు మీరుతోంది. ఇటీవల టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు అందరికి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం సమంతకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అభిమానం పేరుతో ఫ్యాన్స్ నటీనటులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఫ్యాన్స్ తీరుతో అసహనం వ్యక్తం చేశాడు. మలేషియాలో జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ముగించి తమిళనాడు చేరుకున్నాడు విజయ్. ఈ నేపధ్యంలో విజయ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దళపతి విజయ్ రాక కోసం భారీగా అభిమానులు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
భారీ జనసందోహం మధ్యలో విజయ్ తన కారులో ఎక్కేందుకు వెళుతుండగా అభిమానుల తోపులాట మధ్య విజయ్ కాలుజారి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విజయ్ ను చుట్టుముట్టి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.అదృష్టవశాత్తూ విజయ్‌కు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేఫ్‌గా ఉన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణంగా తగిన స్థాయిలో క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమేనని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అలాగే “తలపతి సేఫ్” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రెండింగ్ చేశారు. అదే సమయంలో ఇలాంటి సందర్భాల్లో విజయ్ భద్రతపై మరింత దృష్టి పెట్టాలని ఆయన ఫ్యాన్స్ అభిమానులు కోరుతున్నారు. ఏదేమైనా అభిమానం కొంత వరకు ఉంటె ఓకే కానీ ఇలా వారిని ఇబ్బంది పెట్టడంకరెక్ట్ కాదు.
Also Read
ThalapathyVijay got mobbed by Fans at Chennai Airport !!
A Lesson to be learned ~ How it went smoothly on Malaysia Event Vs Now it's all sudden chaos in Chennai pic.twitter.com/vpS8wm4FWZ
— AmuthaBharathi (@CinemaWithAB) December 28, 2025
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..