NTV Telugu Site icon

Hero Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడు.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!

Thalapathi Vijay

Thalapathi Vijay

కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు.

విజయ్ పొలిటికల్ ఎంట్రీపై తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నయ్య సత్యనారాయణ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవలేడన్నారు. నేడు మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… ‘విజయ్‌ని రాజకీయాల్లోకి రానివ్వండి. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్‌ కూడా వచ్చారు. అలాగే విజయ్‌ని కూడా ప్రయత్నించనివ్వండి. విజయ్‌కి రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే రంగంలోకి దిగాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అయితే తమిళనాడులో విజయ్ గెలవలేడని నేను నమ్ముతున్నా. విజయం చాలా చాలా కష్టం’ అని అన్నారు.

Also Read: Mohanlal-AMMA: ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!

బ్లాక్‌బస్టర్ హిట్‌లకు కేరాఫ్ అడ్రస్ విజయ్. దళపతి విజయ్ నటించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్‌లుగా నిలిచాయి. ఇందులో కొన్ని సోషల్ మెసేజ్‌లతో వచ్చాయి. చివరిసారిగా ‘ది గోట్’ మూవీతో విజయ్ అభిమానుల ముందుకు వచ్చారు. త్వరలోనే మరో సినిమాలో దళపతి నటించనున్నారు. మరోవైపు పొలిటికల్ విషయాలను కూడా చూసుకుంటున్నారు.

Show comments