The Greatest of All Time : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గత ఏడాది “లియో” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్).కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో స్నేహ, లైలా, ప్రశాంత్ మరియు ప్రభుదేవా వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ దర్శకుడు షేర్ చేశారు.
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం ‘అవతార్’, ‘అవెంజర్స్’ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కి పనిచేసిన ప్రముఖ హాలీవుడ్ టెక్నిసియన్స్ పనిచేశారు. తాజాగా ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయినట్లు దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు.అలాగే ఈ సినిమాకు సంబందించి ఓ ఆసక్తికర ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ ఫొటోలో విజయ్ లుక్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ప్రత్యేకంగా ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’ను ఉపయోగించి విజయ్ ను యంగ్ గా చూపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ చిత్రం సెప్టెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.