Site icon NTV Telugu

TGPSC: గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల

Tgspsc

Tgspsc

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.

READ MORE: Mehendi Artist Suicide Case: అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో, గ్రూప్-1 ఫలితాలు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. 563 గ్రూప్-1 పోస్ట్ ల భర్తీకి నియామక పరీక్ష నిర్వహించింది. 10th మార్చిన మార్క్స్ ను అభ్యర్థుల లాగిన్ ఐడీలకు పంపింది టీజీఎస్‌పీఎస్సీ. వచ్చిన మార్క్ లపై అభ్యంతరాలు ఉంటే రికౌంటింగ్ కి అవకాశం ఇచ్చింది. ఈ నెల 24 వరకు రీ కౌంటింగ్ కు అవకాశం ఇచ్చింది. రీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ రోజు జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసింది.

READ MORE: DC vs SRH: స్టార్‌ బ్యాటర్‌ వచేస్తున్నాడు.. ఢిల్లీని సన్‌రైజర్స్‌ అడ్డుకోనేనా?

Exit mobile version