NTV Telugu Site icon

Group 3 Preliminary Key: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్

Tgpsc

Tgpsc

Group 3 Preliminary Key: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా దూసుకెళ్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల గ్రూప్స్ కు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, 2, 3 పరీక్షలను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి కీని పొందొచ్చు. 12వ తేదీ వ‌ర‌కు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండ‌నుంది.

Shocking: 26వ మ్యారేజ్ యానివర్సరీ.. పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య..

ఇక ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అభ్యంత‌రాల‌ను ఆంగ్ల భాష‌లోనే తెల‌పాల‌ని అధికారులు స్పష్టం చేశారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్ లైన్ లోనే సబ్ మిట్ చేయాలని అధికారులు సూచించారు. ఇక గ్రూప్ 3 లో 1365 పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు 50 శాతం మందే హాజరవ్వడం గమనార్హం.

Apple: జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..

Show comments