NTV Telugu Site icon

TG Venkatesh: పొత్తులపై టీజీ వెంకటేష్‌ హాట్‌ కామెంట్లు..

Tg

Tg

TG Venkatesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు, సీఎం పోస్టులపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌ కూడా పొత్తుల వ్యవహారంలో హాట్‌ కామెంట్లు చేశారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రజల మద్దతును వైసీపీ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదన్న టీజీ.. వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అని మండిపడ్డారు.

Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

ఇక, కేంద్రం మద్దతు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికే.. కానీ, వైసీపీకి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్‌.. ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చింది. అంత వరకే అన్నారు. కానీ, బీజేపీ – వైసీపీకి మద్దకు ఇస్తుందని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు.. మరోవైపు.. ఎన్నికలకు మూడు నెలలు ముందు పొత్తులు ఖరారు అవుతాయన్నారు.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుంటారని స్పష్టం చేశారు.. అయితే, పవన్‌ కల్యాణ్‌ బీజేపీతోనే ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే మార్గంలోనే బీజేపీ వెళ్తుందని ప్రకటించారు టీజీ వెంకటేష్‌. కాగా, పొత్తుల కోసం ప్రయత్నిస్తాం.. ఒప్పిస్తాం.. కానీ, వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రం చీలనివ్వం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.