TG Venkatesh: పొత్తులపై టీజీ వెంకటేష్ హాట్ కామెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Venkatesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు, సీఎం పోస్టులపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా పొత్తుల వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రజల మద్దతును వైసీపీ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదన్న టీజీ.. వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు అని మండిపడ్డారు.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు..
Also Read
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఇక, కేంద్రం మద్దతు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికే.. కానీ, వైసీపీకి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్.. ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చింది. అంత వరకే అన్నారు. కానీ, బీజేపీ – వైసీపీకి మద్దకు ఇస్తుందని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు.. మరోవైపు.. ఎన్నికలకు మూడు నెలలు ముందు పొత్తులు ఖరారు అవుతాయన్నారు.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుంటారని స్పష్టం చేశారు.. అయితే, పవన్ కల్యాణ్ బీజేపీతోనే ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే మార్గంలోనే బీజేపీ వెళ్తుందని ప్రకటించారు టీజీ వెంకటేష్. కాగా, పొత్తుల కోసం ప్రయత్నిస్తాం.. ఒప్పిస్తాం.. కానీ, వైసీపీ వ్యతిరేక ఓటు మాత్రం చీలనివ్వం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!