తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిరవధిక సమ్మెకు మే 7వ తేదీ నుంచి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వం తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. మే డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని, వారితో చర్చలకు సిద్ధమని తెలిపారు. సమ్మెకు వెళ్లకుండా సమస్యల పరిష్కారం కోసం సంయమనం పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర కాంగ్రెస్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు (JAC) నిర్ణయించాయి. ఈ సందర్బంగా సమ్మె సంబంధించిన పోస్టర్ ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆవిష్కరించింది. మే డే స్పూర్తితో ఆర్టిసి సమ్మెకు సిద్దం అయ్యింది జేఏసీ. ఇప్పటికైన అయిన ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టాలని, మా న్యాయమైన డిమాండ్ ల…