TFDC: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఆధ్వర్యంలో యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు సరికొత్త పోటీని నిర్వహిస్తోంది. ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలో షార్ట్ ఫిల్మ్స్, పాటల విభాగాల్లో ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన, సంక్షేమ పథకాలు, తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పండుగలు, కళారూపాలను ఈ పోటీలకు థీమ్‌లుగా ఎంచుకున్నారు.
Sandy Master: కిష్కింధపురి చూసి లోకేష్ కనగరాజ్ ఫోన్.. ఏమన్నారంటే?
పోటీ వివరాలు, నియమాలు..
ఈ పోటీలో పాల్గొనేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి:
వయస్సు: పాల్గొనేవారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి.
నిడివి: షార్ట్ ఫిల్మ్స్ 3 నిమిషాలకు మించకూడదు, పాటలు 5 నిమిషాలకు మించకూడదు.
రిజల్యూషన్: వీడియోలు 4K రిజల్యూషన్‌లో ఉండాలి.
విషయం: పోటీ థీమ్‌లకు అనుగుణంగా ఉండాలి.
ప్రత్యేకత: వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా చిత్రీకరించినవై ఉండాలి.
భారీ నగదు బహుమతులు:
ప్రథమ బహుమతి: రూ. 3 లక్షలు
ద్వితీయ బహుమతి: రూ. 2 లక్షలు
తృతీయ బహుమతి: రూ. 1 లక్ష
కన్సొలేషన్ బహుమతి: రూ. 20 వేలు (ఐదుగురికి)
విజేతలందరికీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు.
Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ వేధింపులు.. స్పందించిన కంపెనీ..
ఎంట్రీలు పంపే విధానం:
పోటీలో పాల్గొనాలనుకునేవారు తమ ఎంట్రీలను సెప్టెంబర్ 30, 2025లోగా పంపించాలి. ఎంట్రీలను మెయిల్, లేదా వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చు.
E mail: youngfilmmakerschallenge@gmail.com
Whatsapp: 8125834009 (వాట్సాప్ మాత్రమే).
అందిన ఎంట్రీలను నిర్ణేతల జ్యూరీ పరిశీలించి, విజేతలను ఎంపిక చేస్తుంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఈ పోటీ వివరాలను వెల్లడించారు.