Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు. రాజస్థాన్ దంపతులే డీఎన్ఏ చేయించుకోవడంతో అసలు నిజయం బయటపడింది. డీఎన్ఏతో మా మోసం వెలుగులోకి వచ్చిందన్నారు. కొన్ని రోజులు సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని రాజస్థాన్ దంపతులకు చెప్పామని.. రాజస్థాన్ దంపతులనుంచి తప్పించుకునేందుకు సెల్ ఫోన్లు కాంటాక్ట్ ని పూర్తిగా బ్లాక్ చేశామని వివరించారు. రాజస్థాన్ దంపతుల నుంచి ఒత్తిడి రావడంతో అడ్వకేట్ అయిన తన కుమారున్ని రంగంలో దించినట్లు.. తన కుమారుడి ద్వారా దంపతులను బెదిరించినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.
READ MORE: AP Aqua Farming: ఆక్వా ఎగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్.. రైతులపై మోయలేనంత పన్ను భారం!
“సరోగసి పేరుతో సృష్టి ఇప్పటివరకు చాలా మోసాలు చేసింది. ఐవీఎఫ్ కోసం వస్తున్న వారిని సరోగసి వైపు మళ్ళించి డబ్బులు దోచుకున్నారు. రాజస్థాన్ దంపతులు డీఎన్ఏ పరీక్షలు అడుగుతారని డాక్టర్ నమ్రత ఊహించలేదు.. గాంధీ ఆస్పత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం పూర్తిస్థాయిలో సహకరించాడు.. డాక్టర్ సదానందం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మత్తుమందు ఇచ్చేవాడు.
సదానందం సహకారంతో డాక్టర్ నమ్రత సృష్టిని నడిపిస్తుంది. ఆంధ్రాలో కొంతమంది ఏఎన్ఎమ్ టీచర్ల సహాయం సృష్టి తీసుకుంటుంది. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల తీసుకొని రావడంలో ఏఎన్ఎం కార్యకర్తలే సూత్రధారుగా ఉన్నారు.. గర్భం దాల్చగానే వారిని కంట్రోల్ లో పెట్టుకొని డెలివరీ తర్వాత పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని తీసుకువస్తే వాళ్లకు అన్ని బహుమానాలు ఇచ్చింది నమ్రత.. రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం.” అని పోలీసులు స్పష్టం చేశారు.
