Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.