సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
సరోగసీ ద్వారా సంతానం పేరుతో మోసం చేసిన రాజమండ్రిలోని యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఏపీలోనూ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితులైన ఒక జంట తూర్పుగోదావరి జిల్లా వైద్యశాఖ అధికారులకు వాట్సాప్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్‌లోనూ…
Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు.