NTV Telugu Site icon

Sports: ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలి- ఆకాశ్ చోప్రా

Akash

Akash

Sports: ఓవల్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయాన్ని పొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల తేడాతో ఓడిపోయి మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోయింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 2021లో టీ20 ప్రపంచకప్ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వా..త రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. అయినప్పటికీ, అతను ఐసిసి టోర్నమెంట్‌లో భారత్‌ను విజేతగా చేయలేకపోయాడు. మరోవైపు డబ్ల్యుటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత, పలువురు నిపుణులు మరియు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే WTC కోసం ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముందుకు వచ్చారు.

Read Also: Anasuya: బికినీ లో అనసూయ.. ‘అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి’..!

చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్‌యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి. భారత్ వర్సెస్ పాకిస్తాన్ లేకుండా ఐసిసి ఈవెంట్‌ని మీరు ఊహించగలరా?. టోర్నమెంట్‌లో ఇది వాణిజ్యపరంగా గొప్ప ప్రారంభం అవుతుంది. ఇది అత్యధిక రేటింగ్‌ను పొందుతుంది మరియు ప్రజలు డబ్బు సంపాదిస్తారని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

Read Also: Suman : ఆ సమయంలో నాకు ఆ భగవంతుడు అండగా నిలబడ్డాడు

ఐసీసీ, స్వయంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నిర్వహిస్తోంది. కాబట్టి ఈ టోర్నీలో పాల్గొనే అన్ని టీమ్స్ కూడా మిగిలిన టీమ్స్‌తో మ్యాచులు ఆడేలా షెడ్యూల్ రూపొందించాలి. కనీసం రెండేళ్లకి ఓసారి అయినా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్టు మ్యాచులు చూడొచ్చు…’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా..