నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 45 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ 750 పైగా సినిమాలలో ఆయన నటించి మెప్పించారు.మొదట్లో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన సుమన్ ఆ తర్వాత హీరో హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్లలో అలాగే సహాయ నటుడుగా నటించి మెప్పించారు. సుమన్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. తిరుమల వెళ్లి దండం పెట్టడం తప్ప వెంకటేశ్వరస్వామి మీద తనకు అంతగా భక్తీ ఉండేది కాదని, అలాగే పెద్దగా ఆ స్వామిని కేర్ చేసేవాడిని కాదు అని ఆయన తెలిపారు.
అన్నమయ్య సినిమాలో ఏడుకొండల వాడి పాత్ర చేసిన తరవాత తన మీద ఆ వెంకన్నకు అంత ఇష్టం ఉందని తెలిసిందని అందుకే ఆయన పాత్రను తాను పోషించే అవకాశం కల్పించాడని సుమన్ తెలిపారు. గురువారం తిరుమల కొండపై మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ఉన్న తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి సుమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సుమన్ తన అభిమానులు మరియు స్నేహితులతో కలిసి స్వామి వారి ఆశీస్సులను పొందారు. దర్శనం చేసుకున్న తరువాత సుమన్ కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ను అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాల ను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు.. బుధవారం రాత్రి ఐఏఎస్ అధికారి అయిన రామారావు కుమారుడు పెళ్లి తిరుపతిలో జరిగింది.ఆ పెళ్లికి హాజరయ్యాను. అలాగే ఈరోజు తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజును పురష్కరించుకుని స్వామివారి దర్శనం చేసుకున్నామని సుమన్ చెప్పుకొచ్చారు. హీరోగా చెంగప్ అనే తెలుగు సినిమా చేస్తున్నట్లు అలాగే సిద్ధన్న గట్టు అనే ఫ్యాక్షన్ మూవీ అవేకాకుండా కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా భగవంతుడు నాకు ఆ సమయంలో అండగా నిలబడ్డాడని ఆయన తెలిపారు