West Bengal : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, గవర్నర్ మధ్య మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కునాల్ ఘోష్, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరువు నష్టం నోటీసు పంపారు. గవర్నర్ బోస్ పంపిన ఈ నోటీసులో ….‘‘మీరు గవర్నర్‌ను అప్రతిష్టపాలు చేశారు. ఈ విషయంలో వెంటనే క్షమాపణ చెప్పకపోతే వారిపై ఒక్కొక్కరిపై రూ.11 కోట్ల పరువు నష్టం దావా వేస్తారు.’’ అంటూ రాసుకొచ్చారు. ఈ నోటీసును కొత్తగా ఎన్నికైన తృణమూల్ ఎమ్మెల్యేలు సయంతిక బెనర్జీ, రాయత్ హుస్సేన్ సర్కార్‌లకు పంపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు పరువు నష్టం నోటీసు పంపారు.
Read Also:Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఆ నోటీసు అసలు విషయం ఏమిటి?
మే 2024లో బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో బారానగర్ స్థానం నుండి సయంతికా బెనర్జీ, భగవంగోలా స్థానం నుండి రాయత్ సర్కార్ గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక సమస్య ఏర్పడింది. గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ కు ప్రమాణ స్వీకారం చేసే హక్కు ఇవ్వలేదు. గవర్నర్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ వారిద్దరితో ప్రమాణం చేయించాలని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు. రాజ్ భవన్ సురక్షితం కాదని ఈ ఎమ్మెల్యేలు అన్నారు. ఈ మొత్తం సంఘటన జరుగుతున్నప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్ భవన్ గురించి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రాజ్ భవన్ లో మహిళలకు భద్రత లేదని మమత అన్నారు.
Read Also:Pamban Bridge : ప్రారంభానికి సిద్ధంగా కొత్త పంబన్ బ్రిడ్జీ.. 30 నిమిషాల దూరం కేవలం 5 నిమిషాల్లోనే
అయితే, రాజ్ భవన్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోల్‌కతా హైకోర్టు మమతను కోరింది. ఈ సంఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు గవర్నర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనికి ఇప్పుడు లీగల్ నోటీసు పంపారని చెబుతున్నారు. గవర్నర్ సివి బోస్ పంపిన పరువు నష్టం నోటీసులో రూ.11 కోట్లు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సయంతిక బెనర్జీ మొత్తం ఆస్తులు రూ. 45 లక్షలు, రాయత్ హుస్సేన్ సర్కార్ మొత్తం ఆస్తులు రూ. 3 కోట్లు. సయంతిక బెంగాలీ సినీ నటి కాగా, సర్కార్ తన రాజకీయ జీవితాన్ని తృణమూల్ కాంగ్రెస్‌తో ప్రారంభించారు. కాగా మమతా బెనర్జీ మొత్తం ఆస్తులు రూ. 16 లక్షలు. ఈ విషయాన్ని మమత ఇటీవల వెల్లడించారు.