Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్ గా, రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర నటీనటులు కీలక పాత్ర పోషించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్ లు కూడా మొదలెట్టింది. ఇందులో భాగంగా తాజాగా ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు అమ్మ రాజశేఖర్,హీరో రాగిన్ రాజ్ తోపాటుగా నటి ఎస్తేర్,నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్,ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటి విజి చంద్రశేఖర్,నటుడు ప్రభాకర్ తదితరులు పాల్గోన్నారు.
Also Read: Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్
Also Read
ఇందులో భాగంగా నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘తల’ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి మీ అందరూ మా అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీకి, అమ్మ రాగిన్‌కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని, రాగిన్ కల నిజం కావాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్నను ఎలా మర్చిపోరో.. తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్‌ని కూడా అలా మర్చిపోరు. మీరెప్పుడూ మా ఫ్యామిలీస్‌తో ఉంటారు’అని తెలిపాడు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. ‘తల’ మూవీతో మునుపటి అమ్మ రాజశేఖర్‌ను చూస్తారు. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అతను చెప్పిన దానికంటే ఇంకా బెటర్ గా తీశారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలన్న కసి కనిపించింది. రాగిన్ రాజ్ చాలా అనుభవం ఉన్న నటుడులా కనిపించాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. ఈ 14న రిలీజ్ అవుతున్న ‘తల’ అన్ని రకాల ఎమోషన్స్ తో మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది’ అన్నారు. అలాగే ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒకరు సినిమా గురించి మాట్లాడుతూ. ‘తల’ ను విజయవంతం చేయాలి అని కోరారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!