AP Elections 2024 : ఏపీలో పోలింగ్ మొదలైంది. ఓటేసేందుకు జనాలు పోలింగ్ బూత్ లకు క్యూ కడుతున్నారు. ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరుగా ఈ మాక్ పోలింగ్ ను నిర్వహించారు. పోలింగ్‌పై బూత్ ఏజెంట్స్‌కి పోలింగ్ ఆఫీసర్ అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎంలో ఓటు, వీవీప్యాట్‌లో ఒకే విధంగా వస్తుందో లేదో ఏజెంట్స్ పరిశీలించుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.
Read Also:Elections 2024 : బెంగాల్లో ఓటింగ్ ముందు చెలరేగిన హింస… టీఎంసీ కార్యకర్త హత్య
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా మాచర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెంటాల గ్రామంలో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ లోనే ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. అంతకు ముందు రెంటచింతలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలను కట్టడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
Read Also:AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్..