Pedda Reddy: తాడిపత్రి పట్టణంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పుట్లూరు రహదారిలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా పోలీసులు ఆయన్ను నిలువరించారు. వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులకు ముందుగానే లేఖ ద్వారా సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. అయితే, ఇదే వివాహ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు కూడా హాజరవుతున్నట్లు సమాచారం రావడంతో.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో తాడిపత్రిలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.