Temperature Drop: దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా… మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్‌లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. తెలంగాణలో సాయంత్రం అయిందంటే చాలు చేతులు బిగుసుకుపోతున్నాయి. బయట అడుగుపెడదామంటే జనం బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆ సమయంలో ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మెదక్‌లో అత్యల్పంగా 14 డిగ్రీలు, పటాన్‌చెరులో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 21 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇటు నిజమాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లోనూ చలిగాలులు వీస్తున్నాయ్. ఆదిలాబాద్ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Read Also: Karthika Masam: కార్తిక సోమవారం ఈ స్తోత్రాలు వింటే ఇంటిల్లిపాదికి సుఖసంతోషాలు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇక ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీ ఏరియాల్లో చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి. అరకు ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. ఉదయం వేళల్లో దట్టంగా పొగ మంచు అలుముకుంటోంది. ఘాట్ రోడ్‌లో వెళ్లే వాహనదారులు.. మార్గం కనిపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి. కొందరైతే రోడ్లపై చలి మంటలు కాగుతూ సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. స్వెట్టర్లు వేసుకుంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి. వృద్ధులు, చిన్నారులు చలి, పొగ మంచులో బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మూడు పూటలా వేడివేడి ఆహార పదార్థాలనే తినాలంటున్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!