Tourist Police: తెలంగాణలో పర్యాటక పోలీసులు.. మొదటి దశలో 80 మంది!
- తెలంగాణలో త్వరలోపర్యాటక పోలీసులు
- మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బంది
- సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana to Launch Tourist Police Units: తెలంగాణలో పర్యాటక పోలీసులు త్వరలో రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ వెల్లడించారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం అని డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.
ఈరోజు డీజీపీ కార్యాలయంలో పర్యాటకశాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్, టూరిజం ఎండీ వి.క్రాంతి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ చ.ప్రియాంకతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తాం’ అని చెప్పారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Khazana Jewellery Robbery: కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నాం.. త్వరలోనే ఛేదిస్తాం: డీసీపీ
‘వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదాద్రి, పొచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఈ యూనిట్లు పనిచేయనున్నాయి. షూటింగ్ పర్మిట్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. భద్రతా ఏర్పాట్ల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తాం’ అని డీజీపీ జితేందర్ తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!