TG EAPCET & PGECET Exam Dates: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించే TG EAPCET–2026 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన కీలక తేదీలను అధికారులు ప్రకటించారు. TG EAPCET–2026 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. మే 4, మే 5 తేదీల్లో అగ్రికల్చర్ & ఫార్మసీ ప్రవేశ పరీక్షలు జరగనుండగా.. మే 9 నుంచి మే 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
Harish Rao: గోదావరి జలాలపై అన్యాయం జరుగుతే ఊరుకోం.!
తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదల:
తెలంగాణ టెట్ (TET) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీను కూడా అధికారులు విడుదల చేశారు. ఈ నెల 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. విడుదలైన కీపై అభ్యంతరాలు తెలిపేందుకు వచ్చే నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
TheRajaSaab : అఫీషియల్ రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసిన హాట్ స్టార్
TG PGECET–2026 షెడ్యూల్:
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), తెలంగాణ ఉన్నత విద్య మండలి (TGCHE) ఆధ్వర్యంలో నిర్వహించే TG PGECET–2026కు సంబంధించిన తొలి CET కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సమావేశంలో పరీక్షల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపింది.
TG PGECET–2026 ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 30-01-2026 (శుక్రవారం)
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 23-02-2026 (సోమవారం)
లేట్ ఫీజు లేకుండా దరఖాస్తుల చివరి తేదీ: 27-02-2026 (శుక్రవారం)
హాల్ టికెట్లు విడుదల: 06-05-2026 (బుధవారం)
పరీక్షలు: 28-05-2026 నుంచి 31-05-2026 వరకు (గురువారం నుంచి ఆదివారం వరకు).