Vantara: తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన అంతర్జాతీయ ప్రమాణాల జూ పార్క్ ప్రాజెక్ట్ మరో కీలక దశను చేరుకుంది. రాష్ట్రంలో నిర్ణయించిన నాల్గో నగరంలో ఏర్పాటు చేయబోయే ఈ జూ కోసం, ప్రపంచ స్థాయి జంతు సంరక్షణ, పునరావాసంలో ప్రసిద్ధి చెందిన ముఖేష్ అంబానీ సంస్థ వంతరా (Vantara)తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా నూతన జూ రూపకల్పన, సాంకేతిక నైపుణ్యాలు, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులపై మార్గదర్శకత్వం రాష్ట్రానికి అందనుంది. వంతరా జూ ప్రస్తుతం జంతు సంరక్షణ, రక్షణ, పునరావాసం, అంతర్జాతీయ శాస్త్రీయ నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించే సంస్థగా గుర్తింపు పొందింది. అక్కడ అమలవుతున్న అధునాతన నమూనాలను తెలంగాణలో ప్రతిపాదిత జూకు అన్వయించడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.
Hydra: రూ.600 కోట్ల విలువైన 5 ఎకరాల ఆక్రమణల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
MoUలో ప్రధాన అంశాలు:
• వంతరా జూ నైపుణ్యంతో జంతు సంరక్షణ, పునరావాస చర్యలపై సాంకేతిక మార్గదర్శకత్వం.
• నైట్ సఫారీ రూపకల్పన, భద్రతా ప్రమాణాల ఏర్పాటు.
• ఫారెస్ట్–బేస్డ్ ఎకో థీమ్ పార్క్ అభివృద్ధికి నిపుణుల సలహాలు.
• పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంలో జూ అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకాలు.
• ఆధునిక ఎంక్లోజర్లు, వన్యప్రాణి సంక్షేమ ప్రమాణాలు, సందర్శకుల అనుభవ మెరుగుదలకు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసులు.
అధికారుల ప్రకారం.. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఏర్పడబోయే కొత్త జూ దేశంలోనే కాక ఆసియా స్థాయిలో కూడా కొత్త మోడల్‌గా ఎదగబోతుంది. పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ మరింత ముందడుగు వేయనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అవగాహన ఒప్పందంపై సంతకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినాయి. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, అటవీ దళాల ప్రధాన అధికారి డాక్టర్ సి. సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ MD సునీత భగవత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
వంతరా బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వంతరాలో జంతువులకు అందిస్తున్న అత్యుత్తమ సేవలు, ఆధునిక ఏర్పాట్లు తెలంగాణలో ఏర్పడబోయే కొత్త జూలో కూడా ప్రతిబింబించాలని సూచించారు. ‘జంతువుల సేవ’ అనే నినాదంతో వంతరా చేస్తున్న పనిని ముఖ్యమంత్రి ప్రశంసిస్తూ.. “ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ నెల చివరిలో వంతరాను స్వయంగా సందర్శిస్తానని కూడా వెల్లడించారు. ఈ MoUతో తెలంగాణలో ప్రపంచ స్థాయి జూ ఏర్పాటుకు మార్గం స్పష్టమైంది.
