Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన జీవితంలో మనకు అత్యంత పరిచయమైన వ్యక్తి ఎవరు? రోజూ మనతో మాట్లాడేవారు. మన అలవాట్లు తెలిసినవారు మనకు ఏం ఇష్టమో, ఏం ఇష్టం లేదో తెలిసినవారు. మన ముఖం చూసి మన మూడ్ ఎలా ఉందో చెప్పగలిగేవారు. ఇలాంటి వ్యక్తి గురించి మనకు అన్నీ తెలుసని అనిపిస్తుంది. అక్కడే ఒక చిన్న సమస్య మొదలవుతుంది. ఒక మనిషిని ఎక్కువకాలం తెలుసుకుంటున్న కొద్దీ… వాళ్లను కొత్తగా తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు.
మొదట్లో ప్రతి విషయం గురించి అడుగుతాం. ఈరోజు ఎలా గడిచింది? ఏం అనిపించింది? ఆ మాట ఎందుకు బాధపెట్టింది? నీకు నిజంగా ఏం కావాలి? కొంతకాలానికి ఆ ప్రశ్నలు తగ్గిపోతాయి. ఎందుకంటే సమాధానాలు మనకు ముందే తెలుసనిపిస్తాయి. వాళ్లు ఏం చెబుతారో తెలుసు. ఎలా స్పందిస్తారో తెలుసు. ఏం కోరుకుంటారో తెలుసు. కానీ మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వాళ్ల ఆలోచనలు మారతాయి. వాళ్ల ప్రాధాన్యతలు మారతాయి. వాళ్ల భయాలు మారతాయి. ఒకప్పుడు సంతోషం ఇచ్చిన విషయం తర్వాత సాధారణంగా అనిపించవచ్చు. ఆ మార్పులను గమనించడానికి మనం వాళ్లను మళ్లీ మళ్లీ తెలుసుకోవాలి. ఇక్కడే ఈ కాలపు సంబంధాల్లో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది.
ఒక వ్యక్తి గురించి మన దగ్గర సమాచారం రోజురోజుకూ పెరుగుతోంది. వాళ్లు ఎక్కడున్నారు తెలుసు. ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చారో తెలుసు. ఏ ఫోటో పెట్టారో తెలుసు. ఏం తిన్నారో తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నారో కూడా కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది.
Also Read
ఒక మనిషి జీవితంలోని చిన్నచిన్న వివరాలన్నీ మన కళ్లముందే ఉంటాయి. అయినా వాళ్ల మనసులో ఏం జరుగుతుందో మాత్రం తెలియకపోవచ్చు. ఎందుకంటే సమాచారం పెరగడం, సాన్నిహిత్యం పెరగడం రెండూ ఒకటే కాదు. ఎవరైనా రోజూ మన ముందే ఉన్నారని వాళ్ల అంతరంగం కూడా మనకు కనిపిస్తుందని అర్థం కాదు.
చైనాకు చెందిన సె*క్స్ థెరపిస్ట్ టోంగ్ సాంగ్జెన్ ఇలాంటి సమస్యను రిలేషన్షిప్ బ్లైండ్నెస్ అనే భావనతో వివరించారు. ఆధునిక సమాజంలో సంబంధాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా దగ్గర కావాలి అనే విషయంలో మనుషులకు లోటు కనిపిస్తోందని ఆమె చెబుతున్నారు. ఆ లోటు చాలా సాధారణమైన సందర్భాల్లో బయటపడుతుంది. ఒక వ్యక్తికి తన భాగస్వామితో చెప్పాలనిపించే విషయం ఉంటుంది. బాధ. అసంతృప్తి. భయం.. లేదా తమలో వచ్చిన ఏదో మార్పు. కానీ చెప్పడానికి ముందు ఒక ఆలోచన వస్తుంది. ఇది చెబితే అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారు? అక్కడే మాట ఆగిపోతుంది.
కొన్నిసార్లు పరిచయం తక్కువగా ఉన్న వ్యక్తితో మనసు విప్పి మాట్లాడటం సులభంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మన గురించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉండరు.
దగ్గరి సంబంధాల్లో మాత్రం ఒకరిపై ఒకరికి ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ప్రేమ ఉన్నప్పటికీ సంభాషణ తగ్గిపోతుంది. సంభాషణ తగ్గినప్పుడు ప్రశ్నలు తగ్గుతాయి. ప్రశ్నలు తగ్గినప్పుడు ఊహలు పెరుగుతాయి. అప్పుడు మన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నిజానికి మనకు తెలిసిన పాత వ్యక్తినే చూస్తూ ఉంటాం. బహుశా సంబంధాల్లో నిజమైన సాన్నిహిత్యం అంటే ఒకరి గురించి అన్నీ తెలుసుకోవడం కాదు. వాళ్లు మారుతున్నప్పుడు ఆ మార్పును గమనించేంత ఆసక్తిని నిలబెట్టుకోవడం. ఏళ్లుగా కలిసి ఉన్నా… రోజూ ఒక కొత్త ప్రశ్న అడగడానికి ఇంకా ఏదో మిగిలి ఉండటం.
ఎందుకంటే మనకు బాగా తెలిసిన వ్యక్తి కూడా ప్రతిరోజూ తనలో ఏదో కొత్తదాన్ని మోస్తూ మన ముందుకు రావచ్చు కదా..! అందుకే రిలేషన్షిప్ బ్లైండ్నెస్ తక్కువగా ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. లేదంటే మనకి నచ్చిన వ్యక్తిలో మార్పును చూడలేకపోగా కనీసం దాన్ని అంగీకరించలేని స్థితికి చేరుకుంటాం.. అప్పుడు రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది..!
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!