Site icon NTV Telugu

Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్‌డిస్క్‌ల చోరీ.. కీలక డేటా అపహరణపై కలకలం

Raj Bhavan

Raj Bhavan

Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన భద్రతా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుండి కేసు విచారణ ప్రారంభించి, నిందితుడిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది.

India Pakistan Conflict: పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!

చోరీలో రాజ్‌భవన్‌ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తినే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అతను భద్రతా వ్యవస్థలపై అవగాహనతో, సమయాన్ని ఎంచుకుని హార్డ్‌డిస్క్‌లను అపహరించాడు. ఆయనను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు, చోరీ చేసిన హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అపహరించబడిన హార్డ్‌డిస్క్‌ల్లో రాజ్‌భవన్‌కు సంబంధించిన వ్యవహారాలు, ప్రత్యేక రిపోర్టులు, ఫైళ్లతో పాటు కీలక సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.

Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?

Exit mobile version