Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ…