Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- ప్రివిలేజ్ ఫీజుతో బార్ యజమానులకు నష్టం లేదన్న జూపల్లి
- భారం కేవలం వినియోగదారులపైనే స్వల్పంగా పడుతుందని వెల్లడి
- బార్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ నిరసనలపై స్పందన
- మద్యం ఆదాయం రూ.40 వేల కోట్లకు చేరిందన్న ఎక్సైజ్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన ‘ప్రివిలేజ్ ఫీజు’ నిర్ణయం వల్ల బార్ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, ఈ ప్రభావం కేవలం వినియోగదారులపై మాత్రమే స్వల్పంగా పడుతుందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రివిలేజ్ ఫీజును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అప్‌గ్రేడ్ అయినందున, ఇతర పొరుగు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలకు అనుగుణంగానే ఇక్కడా బార్ లైసెన్సులను జారీ చేశామని తెలిపారు. మద్యం ధరలు పెంచినంత మాత్రాన వినియోగం తగ్గినట్లు ఎక్కడా లేదని, గత అనుభవాలను పరిశీలిస్తే ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి రాబడి పెరుగుతుందే తప్ప విక్రయాలు పెద్దగా తగ్గవని పునరుద్ఘాటించారు.
రూ.40,000 కోట్లకు మద్యం రాబడి..
రాష్ట్రంలో మద్యం ద్వారా వస్తున్న ఆదాయ గణాంకాలను ఈ సందర్భంగా మంత్రి జూపల్లి గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం ద్వారా వచ్చే రాబడి రూ.10,000 కోట్ల నుంచి ఏకంగా రూ.36,000 కోట్లకు, అంటే దాదాపు 260 శాతం మేర పెరిగిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ద్వారా వస్తున్న ఆదాయం ప్రస్తుతం రూ.40,000 కోట్లకు చేరిందని వెల్లడించారు. ప్రభుత్వం నిబంధనలు, చట్ట ప్రకారమే ముందుకెళ్తోందని, రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి నీటి కొరత వంటి సమస్యలేవీ లేవని మంత్రి స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!