Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. రక్త సంబంధీకులే పోటీ పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు పోటీగా నిలిచారు. సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం గడువు…
Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్‌ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు.
Sridhar Babu: తెలంగాణ సెక్రటేరియట్లో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్థిక అరచకత్వానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తూ పని చేస్తున్నామని అన్నారు. కొన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు క్యాబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ అనేక విమర్శలు చేశారని,…
Harish Rao: సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి బాధితులకు ఇచ్చిన కోటి పరిహారం హామీ ఏమైంది? ఇచ్చింది 26 లక్షలే.. ప్రభుత్వం బాకీ పడింది 74 లక్షలు.. ఇది ముఖ్యమంత్రి మాట తప్పడం కాదా? అని ప్రశ్నించారు. కార్మికులకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా ప్రభుత్వం ఇప్పించే నష్టపరిహారంలో చూపించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిస్సిగ్గుగా "బాధితులకు రూ.…
KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్‌ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం "ఆహా నా పెళ్ళంట సినిమా కథ" లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం…
Komatireddy Venkat Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రహ్మత్ నగర్ డివిజన్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తు పై ఓటు వేసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి అండగా నిలవాలని స్థానిక ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్…
Kaleshwaram Report: శాసన సభలో కాళేశ్వరం కమిషన్‌పై చర్చ మొదలైంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ…
KTR : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసి నీటమునిగితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బీహార్ లో టైమ్ పాస్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం అర్ధిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సీఎం అందుబాటులో ఉండాల్సింది పోయి.. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అసలు తెలంగాణకు సంబంధం లేని…