NTV Telugu Site icon

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హరీష్ రావు, రాధా కిషన్ రావుపై ఆరోపణలు

Phone Tapping

Phone Tapping

Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫోన్ టాపింగ్‌ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

Read Also: Mangalagiri Gold Theft: గుంటూరులో భారీగా బంగారం దోపిడీ.. 5 కేజీల బంగారం అపహరణ!

ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఏ1, రాధా కిషన్ రావు ఏ2గా పోలీసులు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురు నిందితులు. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేసారు. ఆ తర్వాత రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్ ను సిమ్ కార్డు కోసం ఉపయోగించారు నిందితులు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్లు చేసారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొనకుండా బెదిరింపులు చేసారు.

Read Also: WPL 2025: చివరి బంతికి ఉత్కంఠభరిత విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు

ఈ ఘటనలో వంశీకృష్ణను కీలక నిందితుడిగా గుర్తించారు అధికారులు. హరీష్ రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో వంశీకృష్ణ ఆయన పేషీలో పనిచేశాడు. గతంలో ఆరోగ్యశ్రీ స్కీమ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కూడా వంశీకృష్ణ అని సమాచారం. ఇప్పుడీ కేసులోనూ వంశీకృష్ణ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు ప్రధాన నిందితులుగా చేర్చడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.