Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ చరిత్రలోనే కాకుండా, దేశంలోనే రికార్డు స్థాయిలో పంట పండిందని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యం తరలింపు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం సివిల్ సప్లై శాఖకు ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల ఆర్థిక వనరులను కల్పించిందని, అందులో ఇప్పటికే 4,800 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి వివరించారు. వరి రెండు పంటలకు కలిపి రైతులకు సుమారు 45 వేల కోట్ల రూపాయలు అందుతున్నాయని పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ సాధించిన స్థాయిలో కొనుగోళ్లు మరెక్కడా జరగలేదని ఆయన గుర్తు చేశారు.
Also Read
ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్ల విషయంలో మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ధాన్యం తూకంలో గానీ, మరే ఇతర కారణాలతో గానీ మిల్లర్లు కటింగ్ పెడితే సహించేది లేదని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కూడా సకాలంలో చేరుకుంటున్నామని, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!