Liquor Shop Licence: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపుల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల కోసం ఏకంగా 95,137 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుల గడువు గురువారం (అక్టోబర్ 23) రాత్రి వరకు పొడిగించగా.. చివరి రోజు ఒక్కరోజే 4,822 దరఖాస్తులు వచ్చాయి. ఓబీసీ బంద్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు నడవకపోవడం, కొన్నిచోట్ల బ్యాంకులు పనిచేయకపోవడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును పొడిగించిన విషయం తెలిసిందే.
Jubilee Hills Bypoll : ఈసారి బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో
అత్యధికంగా రంగారెడ్డి డివిజన్‌లో దరఖాస్తులు వచ్చాయి. ప్రాంతాలవారీగా చూస్తే రంగారెడ్డి డివిజన్‌లో అత్యధికంగా 29,420 దరఖాస్తులు రాగా., ఆదిలాబాద్ డివిజన్‌లో అతి తక్కువగా 4,154 దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తం 2,620 మద్యం షాపుల కోసం వచ్చిన 95,137 దరఖాస్తులకు ఈ నెల 27న డ్రా తీయబడుతుంది. జిల్లా కలెక్టర్ల సమక్షంలో, దరఖాస్తుదారులు సమక్షంలో ఉదయం 11 గంటలకు ఈ డ్రా ప్రక్రియ నిర్వహించబడుతుందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.
Kurnool Bus Fire : మెదక్ జిల్లాకు చెందిన తల్లి-కూతురు దుర్మరణం
ఇక జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలను చూసినట్లతే.. అదిలాబాద్ 771, కోమురం భీమ్ అసిఫాబాద్ 680, మంచిర్యాల 1712, నిర్మల్ 991, హైదరాబాద్ 3201, సికింద్రాబాద్ 3022, జగిత్యాల 1966, కరీంనగర్ 2730, పెద్దపల్లి 1507, రాజన్న సిరిసిల్ల 1381, ఖమ్మంలో 4430, కొత్తగూడెం 3922, జోగులాంబ గద్వాల 774, మహబూబ్‌నగర్ 2487, నాగర్‌కర్నూల్ 1518, వనపర్తిలో 757, మెదక్ 1420, సంగారెడ్డి 4432, సిద్దిపేట్ 2782, నల్లగొండ 4906, సూర్యపేట్ 2771, యాదాద్రి భూవనగిరి 2776, కామారెడ్డి 1502, నిజామాబాద్ 2786, మల్కాజిగిరిలో 5168, మేడ్చల్ 6063, సరూర్ నగర్ 7845, శంషాబాద్ 8536, వికారాబాద్ 1808, జనగామా 1697, జయంశంకర్ భూపాల్‌పల్లి 1863, మహబూబబాద్ 1800, వరంగల్ రూరల్ 1958, వరంగల్ అర్బన్ 3175 రాగా.. మొత్తంగా 95,137 దరఖాస్తులు వచ్చాయి.