Notice to Danam Nagender: నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలి.. దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు.!

  • దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు
  • దానం పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..
  • బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు..
  • నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్ కు హైకోర్టు ఆదేశం..
  • విచారణ వచ్చేనెల 16 కు వాయిదా..
Mla Danam Nagender

Mla Danam Nagender

Notice to Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులో పార్టీ మార్పు అంశంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీ ఎమ్మెల్యే నేత మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన నాగేందర్, తరువాత కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించాయి. వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరారు.

Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దానం నాగేందర్ పార్టీ మారలేదని.. ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని ముందుగా తీర్పు ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగా, స్పీకర్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఫిరాయింపుల అంశంపై గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది, ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం స్పష్టమైన ఫిరాయింపేనని వాదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది.

MI Captain Change: ‘ముంబై ఇండియన్స్’ కెప్టెన్సీ నుండి ‘హార్దిక్ పాండ్య’ అవుట్..? కొత్త కెప్టెన్ గా..!