Site icon NTV Telugu

CM Revanth Reddy: నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court

Telangana High Court

నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై 2020లో నమోదైన కేసుపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకూ నోటీసులు జారీ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 2020లో కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై అభియోగం మోపారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దాన్ని నిరూపించేందుకు తాను డ్రోన్ ఎగర వేశానని, రాజకీయ కక్షతో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. డ్రోన్‌ కేసుకు సంబంధించి ఐదుగురు సాక్షుల వాంగ్మూలాలతో పాటు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

READ MORE: DGP: డీజీపీని కలిసిన రాజ లింగమూర్తి భార్య.. సీబీఐ విచారణ కోరుతూ వినతి

READ MORE: Chandrababu: అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్కి ప్రధాని మోడీని పిలుస్తాం..

Exit mobile version