నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై 2020లో నమోదైన కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులతోపాటు ఫిర్యాదుదారుకూ నోటీసులు జారీ జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 2020లో కేటీఆర్ ఫాంహౌజ్‌పైన డ్రోన్ ఎగరేసి చిత్రీకరించారని రేవంత్ రెడ్డి పై అభియోగం మోపారు. జీవో నెం. 111ను ఉల్లంఘించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫాంహౌజ్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.