TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG SAFE: బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కంటే ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్స్‌లో దొరికే ఆహారం చాలా సురక్షితమని, పరిశుభ్రంగా ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. అందుకే ధర ఎక్కువైనా సరే, పెద్ద బ్రాండ్లే కదా అన్న ధీమాతో పిజ్జాలు, ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే, ఈ బ్రాండెడ్ రెస్టారెంట్లలోనూ ఆహార నాణ్యత ఎంతవరకు ఉందన్న అనుమానాలకు తెరతీస్తూ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (TG SAFE) విభాగం రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఫుడ్ చైన్ అవుట్లెట్లైన డొమినోస్ (Domino’s), కేఎఫ్‌సీ (KFC) స్టోర్లపై అధికారులు ఈ రోజు మెరుపు దాడులు చేపట్టడం సంచలనంగా మారింది.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లోపల కిచెన్ పరిసరాలు ఎలా ఉన్నాయి, ఆహార పదార్థాల తయారీలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పిజ్జాల తయారీకి కాలం చెల్లిన (ఎక్స్పైరీ డేట్ దాటిన) ముడిసరుకులు ఏమైనా వాడుతున్నారా అన్న కోణంలో తనిఖీలు చేశారు. సరుకుల నిల్వ విధానం, పరిశుభ్రతతో పాటు ఆయా అవుట్లెట్లకు సరైన లైసెన్సులు, FSSAI అనుమతులు ఉన్నాయా లేదా అన్న వివరాలను అధికారులు తనిఖీ చేశారు.
Also Read
- Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
- Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
- Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
- CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..
కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఉన్న డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పెద్ద బ్రాండ్ల ముసుగులో ఆహార భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తే సామాన్యుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని TG SAFE అధికారులు స్పష్టం చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘించినట్లు తేలితే ఎంతటి పేరున్న సంస్థలైనా సరే కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించారు.
తాజావార్తలు
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
-
Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
-
Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!