KTR: కాంగ్రెస్ పార్టీకి అభినందనలు.. శుభం జరగాలని కోరుకుంటున్నా: కేటీఆర్

Ktr

Ktr

KTR Tweet Goes Viral: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే 42 స్థానాలు గెలిచిన కాంగ్రెస్.. మరో 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్‌ 60కి కాంగ్రెస్ దగ్గరలో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలిచి ఓటమి దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ తమ ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ‘బీఆర్‌ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చాలా నిరాశ చెందా. మేము దీన్నొక పాఠంగా తీసుకుని.. తిరిగి పుంజుకుంటాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.