NTV Telugu Site icon

TG DSC : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. ఫైనల్‌ లిస్ట్‌ విడుదల

Tgdsc

Tgdsc

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ 11,000 డీఎస్సీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. మంగళవారం విద్యా శాఖ వివిధ జిల్లాల వారీగా ఈ పోస్టుల వివరాలను వెల్లడించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను, 10,006 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, మిగిలిన 1,056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కోర్టు కేసులు , ఇతర కారణాల వల్ల ఇంకా తుది స్థితికి రాలేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2024 డీఎస్సీ ద్వారా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగనుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

Election Campaign: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు విజయం..

ఈ కార్య‌క్ర‌మంలో సుమారు 10,000 మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయబడనున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ద్వారా పూర్తయ్యింది. సోమవారం సాయంత్రం తుది జాబితా పాఠశాల విద్యా కమిషనర్‌ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేయబడుతుంది. ఎల్‌బీ స్టేడియంకు చేరే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు, వీటిలో ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్ , సమన్వయ అధికారిని నియమించాలి. జిల్లా బస్సుల కోసం పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయబడతాయి.

9వ తేదీన హైదరాబాద్‌లో వర్షం వచ్చే అవకాశం ఉండటంతో, రెయిన్‌ ప్రూఫ్‌ షామియానాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు , వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి రానున్నారు, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయబడతాయి.

Bangladesh: రాజ్యాంగం సంస్కరణ కోసం 9 మందితో కమిషన్ ఏర్పాటు

Show comments