తెలంగాణ కొత్త డీజీపీగా బి.శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:44 నిమిషాలకు ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. వేద మంత్రాలతో డీజీపీ కార్యాలయంలోకి ఆయన్ను పండితులు ఆహ్వానించారు. తెలంగాణ 6వ డీజీపీగా 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Also Read: Gold Rate Today: వరుసగా ఐదవరోజు బాదుడే.. లక్ష 20 వేలకు చేరువగా బంగారం ధర!
‘తెలంగాణ డీజీపీగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడం మా మొదటి కర్తవ్యం. తెలంగాణ అభివృధికి, పెట్టుబడులు రాకకు లా అండ్ ఆర్డర్ ఎంతగానో దోహదపడుతుంది. మా ముందు ఉన్న లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించడం. మీడియా సహకారం చాలా అవసరం. పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడండి. మావోయిస్టులపై నమోదు అయిన కేసులు విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తా. మావోయిస్టుపై వేధింపులు ఉండవు. ప్రభుత్యం ముందు మీరు ఆత్మసమర్పణ చేసుకోండి, ముందుకు రండి. మావోయిస్టు పార్టీ నుండి బయటికి రండి. మావోయిస్టు పొలిట్ బ్యూరో సుజాత ఇటీవలే మావోయిస్టు పార్టీని వీడారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్మెంట్ జగన్ ఖండించారు. మావోయిస్ట్ నేత జగన్ ఇచిన స్టేట్మెంట్ అందరూ చూసాం. వీరి మధ్యలో సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం మావోయిస్టులకు అందించాల్సిన బెనిఫిట్స్ అందిస్తాం. సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ సిబ్బంది స్కిల్స్ పెంచుతాం. బేసిక్ పోలింగ్ అండ్ విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాము’ అని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.