Panchanga Sravanam: సీఎం రేవంత్‌రెడ్డికి పాలన పరంగా ఇబ్బందులు లేవు.. గాంధీ భవన్ పంచాంగ శ్రవణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchanga Sravanam: తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.. తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో మేలు జరగాలని కోరుకున్నారు. ప్రజలు సుఖ శాంతులతో ఉండేలా భగవంతులు ఆశీస్సులు ఉండాలి. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రజల మద్దతు తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఏఐసీసీ నాయకులు ఖర్గే , సోనియాగాంధీ రాహుల్ గాంధీ కృషితో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు అంత ఎంతో శ్రమించి ఒక అద్భుతమైన పాలన అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పరాభవ నామ సంవత్సరంలో ఎవరు ఎవర్ని పరాభవం చేయకుండా అంత కలిసి కట్టుగా సుఖ శాంతులతో ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విదంగా అర్హులైన వారి లబ్ది పొందే విదంగా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని కోరారు..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఇక గాంధీ భవన్‌లో చిలురు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “దేశాలు యుద్ధాన్ని కోరుకుంటాయి. ప్రపంచం దేశాల యుద్ధం తో దేశం నష్టపోతుంది.. అమ్మాయిలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతాయి. విడాకుల కేసులు పెరిగే అవకాశం ఉంది.. కొత్త చట్టాలతో పాత చట్టలకు మంగళం పాడతారు. రాశి ఫలాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మహేష్ గౌడ్ నూతన పదవులు అలంకరించ బోతున్నారు. పీసీసీకి ప్రతి ఒక్కరు సహకరించాలి.. అడుగుజాడల్లో నడవాలి. వాణిజ్య పంటలు ఈ సారి సమృద్ధిగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందంగా ఉంటారు. పడిన పంటకు మంచి ఫలితం రైతులకు అందుతుంది. ఒడిదుడుకులు ఉన్న సీఎం రేవంత్‌కి పాలన పరంగా ఇబ్బందులు లేవు..” అని వివరించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?