Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో చీలికలు.. రెండుగా చీలిన హస్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. నిన్నటి వరకు సీనియర్లు తమకు సముచిత గుర్తింపు దక్కడం లేదంటూ.. నేటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను బైకాట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పీసీసీ కమిటీలో పదవులు దక్కి సీనియర్లతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన నేతలు పీసీసీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలి ఓవైపు రేవంత్ రెడ్డి వర్గం.. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ వర్గం ఎవరికి వారు విమర్శలు చేస్తున్నారు. మాకు పని మాత్రమే ముఖ్యమని పదవులతో సంబంధం లేదని రేవంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. ఇదే సమయంలో.. ఎన్టీవీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రజలంతా టీఆర్ఎస్ మీద అసంతృప్తితో ఉన్నారని, కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు కానీ నాయకుల వ్యవహార శైలి ప్రజలని అసంతృప్తికి గురిచేస్తుందన్నారు.
Also Read :A Strange Case: భర్తపై భార్య అత్యాచారం.. 29 గంటలపాటు ఏకధాటిగా
మాకు పదవులు ఇవ్వడమే పెద్ద నేరం అన్నట్లు నిన్న మాట్లాడిన నేతలు భావిస్తున్నారని, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని భావనతో ప్రజలు ఉన్నారని, ఇలా నాయకులం పోట్లాడుకోవడం ప్రజలు సహించరన్నారు. కేసీఆర్‌తో కొట్లాడటానికి సీనియర్ నేతలకు మా పదవులే అడ్డంకి అని భావిస్తున్నారని, మా పదవులే అడ్డంకి అనుకుంటే మాకు పదవులు అక్కరలేదన్నారు. అందుకే మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి మేం పని చేస్తామని సీతక్క వ్యాఖ్యానించారు.
Also Read : BIG BREAKING : కాంగ్రెస్‌లో 12 మంది రాజీనామా.. మాణిక్కం ఠాగూర్‌కు లేఖలు
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
తాజావార్తలు
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?